Page Loader
Anil Chauhan: 'నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేము': చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌
'నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేము': చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌

Anil Chauhan: 'నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాన్ని గెలవలేము': చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. మే 10న జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లు, డ్రోన్ ఆయుధాలు ఉపయోగించిందని చెప్పారు. అయితే, అవి ఏ ఒక్క భారతీయ సైనిక స్థావరం గానీ, పౌర కేంద్రలపై దాడి చేయడంలో విఫలమైనట్లు వెల్లడించారు. ఆ డ్రోన్లను కైనిటిక్,నాన్ కైనిటిక్ విధానాలతో కూల్చివేసినట్లు చెప్పారు. అంతేకాకుండా,కొన్ని డ్రోన్లను రికవరీ చేసిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. యూఏఎస్ డ్రోన్ వ్యవస్థలు ఇప్పుడు ఎంతో కీలకంగా మారాయని చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంతో ఉపయోగపడినట్లు ఆయన వివరించారు.

వివరాలు 

డ్రోన్ల అభివృద్ధిలో మరింతగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది: అనిల్ 

భవిష్యత్‌లో మన రక్షణ కోసం డ్రోన్ల అభివృద్ధిలో మరింతగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అనిల్ చౌహాన్ సూచించారు. యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ల ప్రాధాన్యాన్ని గురించి చర్చిస్తున్న సందర్భంలో, ప్రస్తుతం ఈ వ్యవస్థల్లో మేం అభివృద్ధిని సాధించామా? లేక ఇది విప్లవాత్మకమైన మార్పుగా పరిగణించాలా? అనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

వివరాలు 

యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది : అనిల్  

డ్రోన్ల వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను సాధారణ అభివృద్ధిగా భావించాలనీ, అయితే యుద్ధాల్లో అవి ఉపయోగపడుతున్న విధానాన్ని మాత్రం విప్లవాత్మకమైన మార్పుగా పరిగణించాలనేది తన అభిప్రాయమని చెప్పారు. యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం గణనీయంగా విస్తరించిందని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న యుద్ధాల్లో ఆర్మీలు డ్రోన్లను విప్లవాత్మకంగా వినియోగిస్తున్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాలలో డ్రోన్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా గమనించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌