
Pakistan: పాక్ గూఢచారి మోతీరామ్‌కు విస్తృత నెట్‌వర్క్..!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ కు సున్నితమైన సమాచారాన్ని సరఫరా చేస్తూ బయటపడిన CRPF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోతీరామ్ జాట్ తన పరిధిలో పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు ప్రకారం,అతడి ఫోన్‌లో 15మంది నంబర్లను గుర్తించారు. వీటిలో నలుగురు ఆర్మీ సిబ్బంది, నలుగురు పారామిలటరీ సిబ్బంది,మిగతా వారు ప్రభుత్వ అధికారులుగా గుర్తించబడ్డారు. మోతీరామ్ జాట్‌ను మే 27న NIA అరెస్ట్ చేసింది.ప్రస్తుతం దర్యాప్తుబృందాలు అతడి ఫోన్ విశ్లేషణను కొనసాగిస్తున్నాయి. ఫోన్ ద్వారా అతను ఇంటర్నెట్ కాల్స్ చేసినట్లు,పాకిస్థాన్‌లోని సలీం అనే ఆపరేటివ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జాట్‌తో సంభాషించేందుకు వాడిన సిమ్‌కార్డ్‌ను కోల్‌కతా నుంచి ఒక వ్యక్తి తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ సిమ్ యాక్టివేషన్ OTPను అతను లాహోర్‌లోని పాక్ ఆపరేటివ్‌తో పంచుకున్నాడు.
వివరాలు
పాక్ జాతీయురాలిని పెళ్లి చేసుకున్న కోల్‌కతా వ్యక్తి
సదరు కోల్‌కతా వ్యక్తి పాకిస్థాన్ జాతీయురాలిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. అతను ఏటా రెండు సార్లు కోల్‌కతాకు వెళ్ళి వస్తున్నాడని కూడా గుర్తించారు. మోతీరామ్ జాట్ నుంచి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఈ లాహోర్ ఆపరేటివ్‌కు తేవడం కోసం అతను రూ.12,000 వరకు చెల్లించేవాడు. ఆ డబ్బులు భారత్‌లోని దిల్లీ,మహారాష్ట్ర,హరియాణా,యూపీ,రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్,అస్సాం,వెస్ట్‌బెంగాల్ లోని వివిధ ఖాతాల నుంచి జమ అవుతున్నాయి.
వివరాలు
భిన్నంగా షెహజాద్ వాదన
ఈ నగదు పంపించే వారిలో ఒకరి పేరు షెహజాద్‌గా గుర్తించారు. అతడిని యూపీ పోలీసులు మే లోనే అరెస్ట్ చేశారు. షెహజాద్ పాకిస్థాన్ నుంచి దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, కాస్మేటిక్స్ స్మగ్లింగ్ చేసేవాడని తేలింది. అయితే, అతడు తన వాదనలో వేరే విషయాన్ని చెప్పాడు. రైల్లో దిల్లీ నుంచి పంజాబ్‌కి వెళ్తున్నప్పుడు, తోటి ప్రయాణికుడు అతడికి జాట్ నెంబర్ ద్వారా రూ.3,500 పంపమని చెప్పినట్లు, ఆ మొత్తాన్ని అతను నగదు రూపంలో అందుకున్నట్లు పేర్కొన్నారు.