Page Loader
Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల
మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల

Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో కూడా మలేషియాలో మాదిరిగా పామాయిల్‌ విత్తన కేంద్రం (సీడ్‌ గార్డెన్‌)ను స్థాపించి, అవసరమైన విత్తనాలను సొంతంగా అందుబాటులోకి తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ లక్ష్యంతో మలేసియాలోని ఎఫ్‌జీవీ కంపెనీ సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు. మలేసియా పర్యటనలో భాగంగా గురువారం కౌలాలంపూర్‌లో ఎఫ్‌జీవీ సీడ్‌గార్డెన్‌ను ఆయన సందర్శించారు. తరువాత, ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పామాయిల్‌ సాగు విస్తృతంగా పెరుగుతుండటంతో, స్వతంత్ర విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.