కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు
హైదరాబాద్ : ఇకపై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వాహనాలను పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్‌పై సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు పార్కింగ్ చేస్తే రూ.200 నుంచి 2 వేల వరకు ఫైన్ విధించనున్నారు. రాత్రిపూట ప్రత్యేక కెమరాలతో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. హైదారాబాద్ ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రసిద్ధి పొందింది. తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా వస్తుంటారు. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉండనుంది.
కేబుల్ బ్రిడ్జిపై వాహనాల పార్కింగ్ నిషేధం
హైదరాబాద్‌లో సెల్ఫీ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జిపై వాహనాల పార్కింగ్ పై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు. బ్రిడ్జిపై పార్క్ చేసిన వ్యక్తులను తరిమికొట్టేందుకు పోలీసు అధికారులు ఇప్పటి వరకు సైరన్‌లు మోగిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. బ్రిడ్జి పక్కన ఆపే బైకులు, కార్లు నంబర్ ప్లేట్‌లను కెమెరాలు ఆటోమేటిక్ బంధించి, అక్కడిక్కడే జరిమానాలను అధికారులు విధించనున్నారు. బ్రిడ్జిపై బండి పార్కింగ్ చేయడం వల్ల వంతెన చూడటానికి వచ్చే సందర్శకులకు ఇబ్బంది కలుగుతుందని, అందుకే ట్రాఫిక్ నిబంధనలను పాటించనివారికి జరినామా విధిస్తున్నట్లు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.