Page Loader
Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!

Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి ముందుకు తెచ్చారు. ఆయన దిల్లీ వాతావరణ పరిస్థితుల కారణంగా పార్లమెంట్ సమావేశాలు దక్షిణ భారతదేశంలో నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. దిల్లీలో వేసవిలో ఉక్కపోత, శీతాకాలంలో చలిలాంటి ప్రతికూల పరిస్థితులు, అలాగే వాయు కాలుష్యం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. 1950వ దశకంలోనే దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్ మొదలైందని తెలిపారు. 1968లో ఎంపీ ప్రకాశ్‌వీర్‌ శాస్త్రి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అప్పటి కేరళ, మైసూరు రాష్ట్రాలు పార్లమెంట్ సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ప్రతిపాదించాయి.

Details

రెండోవ రాజధానిగా హైదరాబాద్

అయితే ప్రభుత్వ విరుద్ధత కారణంగా ఈ ప్రతిపాదన ఆమోదం పొందకపోయింది. ప్రస్తుతం దేశంలోని ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పన్నుల పంచాయతీ, డిలిమిటేషన్, సీట్ల తగ్గింపులో వివాదాలున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. అంబేద్కర్ కూడా గతంలో హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా సూచించారని, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌ను పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సరైన ప్రాంతంగా భావించే ఆలోచన ఉంచారు.