Ramdev Baba: పతంజలి వివాదం..రామ్‌దేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు జరగడంతో కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.
Details
కోర్టుకు హాజరు కాని రామ్ దేవ్ బాబా
ఫిబ్రవరి 1న విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించగా, వారు హాజరు కాలేదు. దీంతో కోర్టు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసు మరింత విచారణ కోసం ఫిబ్రవరి 15న తిరిగి చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
గతంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నేపథ్యంలో పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే.