Pawan kalyan: అట్టహాసంగా నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(మంగళవారం) పిఠాపురంలో నామినేషన్ వేశారు. గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో అయన శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం క్రిస్టియన్ మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నామినేషన్ వేశారు. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆస్తి ఎన్ని కోట్లు అంటే? 5సంవత్సరాలలో తన సంపాదన రూ.114.76 కోట్లు అని ఎన్నికల అఫడవిట్ లో తెలిపారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.73.92 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మరో 20కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. తనకు రూ.64.26 కోట్ల అప్పులు ఉన్నట్లు జనసేనాని అఫడవిట్ లో పేర్కొన్నారు.