తదుపరి వార్తా కథనం

CM Chandrababu and Pawan: దేవరపల్లి రోడ్డు ప్రమాదం ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 11, 2024
12:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలన్నారు.ప్రభుత్వము బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనను బాధాకరంగా అభివర్ణించారు.జీడిపిక్కలు తరలిస్తున్న వాహనం బోల్తా పడిన కారణంగా అందులో ఉన్న కూలీలు చనిపోయారని సమాచారం అందిందన్నారు.
కష్టజీవులు ప్రమాదంలో మరణించడం విచారకరమని చెప్పారు.వారి కుటుంబాలకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ప్రభుత్వం బాధిత కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటుందని చెప్పారు.