Page Loader
జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్ 
జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్

జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్ 

వ్రాసిన వారు Stalin
Oct 02, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మచిలీపట్నంలో పవన్ రెండు గంటల పాటు ఈ దీక్ష చేప్టటారు. ఈ సందర్భంగా గాంధీతో పాటు, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మచిలీపట్నంలో గాంధీ జయంతి జరపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్ల చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై కూడా పవన్ విమర్శలు గుప్పించారు. జగన్‌తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. వైసీపీ సర్కారు పాలసీలతోనే తాను విభేదిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ మాదిరిగా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి, జైలుకు పంపే ఉద్దేశం తమకు లేదనన్నారు. ప్రతిపక్ష నాయకులపై జగన్ ఆలోచన సరికాదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నివాళులర్పిస్తున్న పవన్ కళ్యాణ్