
Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది.
నేటితో నారా లోకేష్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బుధవారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
దీని కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హాజరుకానున్నారు.
మొదట ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు టీడీపీ ఆహ్వానం పంపింది.
అయితే ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో తాను హాజరు కాలేనని మొదట పవన్ కళ్యాణ్ చెప్పారు.
Details
11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పవన్ ఇంటికి చంద్రబాబు కూడా వెళ్లారు.
ఇక చంద్రబాబే స్వయంగా యువగళం ముగింపు సభకు రావాలని కోరారు.
చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హజరవుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఈ విషయాన్ని టీడీపీ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈనెల 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. దాదాపు 11 నెలల పాటు సాగి విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది.
మొత్తంగా నేటితో లోక్ 3,123 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఏపీలో ఎన్నికల సమరానికి ముందు టీడీప, జనసేన పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమం ఇదే కావడం విశేషం.