NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
    హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా హితవు

    Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులకు కడగండ్లుగా మారాయి.

    శనివారం సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో ఇది భద్రతా బలగాల ఘన విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.

    ఈ విజయాన్ని మావోయిజానికి మరో నిర్ణయాత్మక దెబ్బగా అభివర్ణించిన అమిత్ షా, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు.

    సుక్మాలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టి, భారీ మొత్తంలో ఆటోమెటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు.

    Details

    హింస మార్పును తీసుకురాదు

    ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో, సాయుధ తిరుగుబాటులో పాల్గొంటున్న వారికి అమిత్ షా కీలక విజ్ఞప్తి చేశారు.

    హింస మార్పును తీసుకురాదని, అభివృద్ధి, శాంతి మాత్రమే మార్గమని హితవు పలికారు. ఈ ఎన్‌కౌంటర్ సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్‌లలో ఒకటిగా చెప్పబడుతోంది.

    ఈ ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్ గార్డ్స్(DRG), సీఆర్‌పీఎఫ్ సంయుక్త దళాలు పాల్గొన్నాయి.

    మార్చి 22న అమిత్ షా పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. 2026 మార్చి 31 నాటికి దేశంలోని మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అమిత్ షా

    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా  రాహుల్ గాంధీ
    Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు కేంద్ర ప్రభుత్వం
    Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నాయి: అమిత్ షా జమ్ముకశ్మీర్
    PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు నరేంద్ర మోదీ

    కేంద్ర ప్రభుత్వం

    Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్
    HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు భారతదేశం
    Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్‌పోల్‌' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు అమిత్ షా
    Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి జైశంకర్ డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025