Cycle Tracks:మురికివాడల్లో పరిశుభ్రమైన నీరు లేవంటే.. ప్రజలు సైకిల్ ట్రాక్‌ల గురించి పగటి కలలు కంటున్నారా? సుప్రీంకోర్టు ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
సైక్లింగ్ ప్రోత్సాహకుడు దేవీందర్ సింగ్ నాగి వేసిన ఈపిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రజలకు గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వాల వద్ద సరిపోను నిధులు లేవని, బస్తీ ప్రజలకు తాగునీరు కూడా సరైన విధంగా అందించడం కష్టమవుతోందని, అలాంటి పరిస్థితుల్లో మీరు సైకిల్ ట్రాక్‌లు కావాలంటూ దృష్టిపెడతారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
జస్టిస్ అభయ్ ఎస్.ఓకా,ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది.
ప్రజల అవసరాలను ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని,అత్యవసరమైన ఇతర అంశాలపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని సూచించింది.
మురికివాడల్లో ప్రజలు ఎలాంటి దయనీయస్థితిలో జీవిస్తున్నారో వెళ్లి చూడాలని,ప్రజలకు గృహ నిర్మాణం చేయడానికి సరిపడా నిధులు లేవు.
వివరాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోర్టు సూచన
కాని మీరు మాత్రం ప్రత్యేక సైకిల్ ట్రాక్‌ల గురించి ఆలోచిస్తున్నారా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజలకు ప్రాథమిక వసతులు లేవన్న ఈ పరిస్థితుల్లో,ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు కావాలని కోరడం తగదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాధాన్యతలు దారి తప్పుతున్నాయని, మన క్రమాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోర్టు సూచించింది.
ప్రజలకు తాగునీరు సరైన విధంగా అందడం లేదని,ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, ఇలాంటి విపరీత పరిస్థితుల్లో సైకిల్ ట్రాక్‌లపై దృష్టి పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు మందలించింది.
అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే సైకిల్ ట్రాక్‌లు ఉన్నాయని,సుప్రీంకోర్టు భవనం బయట కూడా ఒక సైకిల్ ట్రాక్ ఉందని పిటిషనర్ దేవీందర్ సింగ్ నాగి పేర్కొన్నారు.