Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది.
ఈ శివలింగంపై పర్షియన్ శాసనం లభ్యమైనట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
ఇది నిజాం కాలపు శాసనమని తెలిసింది. ఇంతకు మునుపు ఎక్కడా శివలింగంపై శాసనం లభించిన దాఖలా లేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
నస్తాలిక్ కాలిగ్రఫీ శైలిలో ఉన్న ఈ పర్షియన్ శాసనం ఒక శిలపై చెక్కబడింది, ఇది శివలింగాన్ని పోలి ఉంటుంది.
Details
లింగంపై తెలుగులో కూడా చెక్కిన శాసనపంక్తులు
ఈ శాసనం హైదరాబాద్ నవాబు (8వ) నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా, ముకరం ఉద్ దౌలా బహదూర్ కొలువులోని జైన్ చంద్ర అనే రెవెన్యూ అధికారి 1350 హిజ్రి 3వ జిల్హిజి అంటే 1932 ఏప్రిల్ 9వ తేదీన అక్కడి బంజరులో మొక్కలు నాటించారు.
ఈ విషయాన్ని లింగంపై శాసన రూపంలో నమోదు చేశారు. అదే లింగంపై తెలుగులో కూడా చెక్కిన శాసనపంక్తులు కనిపిస్తున్నాయని ఆ ఫోటో సమకూరలేదని హరగోపాల్ చెప్పారు.