
Rahul Gandhi's dual citizenship: రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం అంశం దాఖలైన పిటిషన్‌పై కేంద్రం స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వంపై (Rahul Gandhi's dual citizenship) కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించింది.
రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, అందువల్ల ఆయన భారత పౌరసత్వం రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి స్పందన కోరింది.
ఈ పిటిషన్‌ను న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేశ్ శిశిర్ వేశారు. అలాగే రాహుల్ గాంధీ పౌరసత్వంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కూడా అభ్యర్థించారు.
వివరాలు
2019లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
రాహుల్ బ్రిటన్‌లో నమోదైన ఒక కంపెనీకి డైరెక్టర్ మరియు సెక్రటరీగా ఉన్నారని, ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి తెలిపారు.
ఈ విషయాన్ని 2019లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ ద్వారా తెలియజేశారు.
ఒక వ్యక్తి వేరే దేశ పౌరసత్వం కలిగి ఉంటే భారత పౌరసత్వం స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని, ఆర్టికల్ 9 ,భారతీయ పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం ఇది తప్పని పేర్కొన్నారు.
ఈ అంశంపై తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.