LOADING...
PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్‌ డబ్బుల జమ..?
రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్‌ డబ్బుల జమ..?

PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్‌ డబ్బుల జమ..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వారణాసిలో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రైతులకు ఈ సొమ్మును విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరంగా చూస్తే, మొత్తం 41.58 లక్షల రైతు కుటుంబాలకు కలిపి రూ.831.60 కోట్లు పంపిణీ కానున్నాయి. ఇదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కిందనూ, నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

46.20 లక్షల మంది రైతుల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి 

ఈ మేరకు,కేంద్ర పథకం పీఎం కిసాన్ ద్వారా ప్రతి రైతుకు రూ.2,000 చొప్పున నిధులు జమ అవుతుండగా,రాష్ట్ర పథకం అన్నదాత సుఖీభవ కింద ప్రధమ విడతగా రూ.5,000 చొప్పున ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46.64 లక్షల మంది రైతు కుటుంబాలు అన్నదాతా సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటికే 46.20 లక్షల మంది రైతుల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇంకా 40,346 మంది రైతులకు ఈ కేవైసీ చేయాల్సి ఉంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే, వారికి సంబంధించిన కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక, రెండో విడతలో నిధులు జమ చేయడం జరుగుతుంది. అంతేకాదు, అప్పటివరకు జమ చేయని మొదటి విడత నిధులు కూడా రెండో విడతలో కలిపి అందజేస్తారు.