ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్
దిల్లీలోని ఎర్రకోట వేదికగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేకంగా ఆయన 6G గురించి ప్రస్తావించారు. వడివడిగా భారత్ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తోందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీని సైతం ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలో 6Gపై మరోసారి చర్చ ఊపందుకుంది. ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోందని మోదీ తన ప్రసంగంలో వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ ధరలకే మొబైల్ డేటా ప్లాన్లు భారత్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం 5జీ సాంకేతికత అందుబాటులో ఉందన్న మోదీ, త్వరలోనే అది 6జీకి అప్ గ్రేడ్ అవనున్నట్లు చెప్పారు.
5Gతో పోల్చితే 6G నెట్‌వర్క్ స్పీడ్ 1000 రెట్ల అధిక వేగం
దేశవ్యాప్తంగా సుమారు 700 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మారుమూల పల్లెలకూ 5జీని విస్తరించనున్నామని టెలికాం నెట్‌వర్క్ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 5Gతో పోల్చితే 6G నెట్‌వర్క్ 1000 రెట్ల అధిక వేగంతో సేవలు అందించగలుతుంది. సెకండ్ కు 10 గిగాబైట్ (GB) వేగంతో 5G నెట్‌వర్క్ పనిచేస్తుంది. అదే 6G సెకండ్ కు ఒక టెరాబైట్ (TB) వేగంతో దూసుకెళ్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగానూ 5G ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్ నుంచి 66 గిగాహెడ్జ్ (SPECTRUM WAVE)లను ఉపయోగిస్తుంటారు.దీంతో డేటా బదిలీ వేగంగా జరిగిపోతుంది. 6Gలో 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటుతుంది. ఒక దశలో టెరాహెడ్జ్‌ల వరకు స్పెక్ట్రమ్ వేవ్ లను వినియోగించవచ్చు.