LOADING...
PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు

PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్‌ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు పాల్గొన్నారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో,దిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మహిళా సభ్యులు ప్రధాని మోదీకి రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. రాఖీలు కట్టిన తర్వాత, ప్రధాని వారితో కొంతసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, సరదా ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గత సంవత్సరం కూడా ప్రధాని మోదీ ఇదే విధంగా స్కూలు విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న సంగతి తెలిసిందే.

వివరాలు 

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఇక అంతకుముందు, రాఖీ పండుగ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ''సోదరుడు-సోదరి మధ్య ఉండే అపూర్వమైన, అపారమైన ప్రేమకు రక్షా బంధన్‌ ప్రతీక. ఈ పండుగ మీ బంధాలను మరింత మధురంగా మార్చాలని, పరస్పర ఆప్యాయతను, సామరస్యాన్ని మరింత బలపరచాలని, దేశంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ఆయన ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు