LOADING...
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేసింది.

వివరాలు 

తిరుపతికి చంద్రబాబు

అంతేకాక, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఏర్పడిన తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముందస్తు చర్యల్లో వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలుసుకొని తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగకుండా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను స్వయంగా పరామర్శించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పిఎంఓ ఇండియా చేసిన ట్వీట్