
PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని మోదీ అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అధికార పార్టీకి ఏటీఎంలా మారినట్లు దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రైతుల కష్టాలు కేసీఆర్ సర్కారు ఏ మాత్రం పట్టడం లేదన్నారు.
మోదీ
బీజేపీ ఏం చెబితే అదే చేస్తుంది: మోదీ
బీజేపీ ఏం చెబితే అదే చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది వరకు ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ హామీని తాము నిలబెట్టుకున్నామన్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లును అమలుకు మార్గాన్ని సగమనం చేసినట్లు పేర్కొన్నారు.
అలాగే అయోధ్య రామమందిరాన్ని కూడా నిర్మించామన్నారు. తాము హామీ ఇచ్చామంటే.. కచ్చితంగా నెరవేర్చి తీరుతామన్నారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డును చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని, తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు.
అలాగే, ఎస్సీ వర్గీకరణకు మద్దతు నిలుస్తామని చెప్పారు. తెలంగాణలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.