Page Loader
కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 
కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్

కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్ 

వ్రాసిన వారు Stalin
May 31, 2023
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు చేర్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ బుధవారం రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరిగేవని, ఆ సమయంలో యువత చీకటిలో ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానికి మించి సూపర్ పవర్ ఇంకొకరు ఉండేవారని మోదీ విమర్శించారు. ఆనాడు ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసిందని దుయ్యబట్టారు.

మోదీ

కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడం అలవాటే: మోదీ

2014కి ముందు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో ఉండేవారని, పెద్ద నగరాల్లో తీవ్రవాద దాడులు జరిగేవని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని అన్నారు. కాంగ్రెస్ 'గరీబీ హఠావో'పై కూడా ప్రధాని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడం అలవాటే అన్నారు. 50ఏళ్ల క్రితం కాంగ్రెస్ దేశానికి 'గరీబీ హఠావో' హామీ ఇచ్చిందిని, పేదలకు ఆ పార్టీ చేసిన అతి పెద్ద ద్రోహం ఇదేననన్నారు. పేదలను మోసగించడమే దీని వ్యూహమన్నారు. దీని వల్ల రాజస్థాన్ ప్రజలు నష్టపోయారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే దేశ ప్రజలందరికీ కరోనా టీకాలు చేరుకోవడానికి మరో 40 ఏళ్లు పట్టేదని ప్రధాని మోదీ విమర్శించారు.