NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని 
    వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని

    PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని 

    వ్రాసిన వారు Stalin
    May 08, 2024
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

    40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు.

    ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ఈ ప్రాంతం కాకతీయుల విజయానికి ప్రతీక అన్నారు. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్ళీ బీజేపీ రావాలన్నారు.

    ఫిర్ ఎక్ బార్.. మోడీ సర్కార్ అని నినదించారు. ప్రపంచమంతా అనేక విపత్తులు ఎదుర్కుంటుందని.. దేశం దృష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు.

    Details 

    కాంగ్రెస్ రుణమాఫీ వట్టి మాటే..

    ఏడాదికి ఓ ప్రధాని చొప్పున ఉంటే ఈ దేశ భవిష్యత్ ఏమై పోతుందో ఆలోచించండని సూచించారు.

    ఇండియా కూటమికి చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కోరు అని విమర్శించారు.

    లోక్ సభ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ రుణమాఫీ వట్టి మాటే అని తెలిపారు.

    సనాతన ధర్మాన్ని తిడుతున్న కాంగ్రెస్ నాయకులు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారని తెలిపారు.

    కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతక పార్టీ అని విమర్శించారు.సమ్మక్క సారక్క యునివర్సిటీ నిర్వహణ విషయంలో కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు.

    దళిత సామాజికవర్గానికి చెందిన రామ్‎నాథ్ కోవింద్‎ను..రెండోసారి ఆదివాసీ‎ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అని చెప్పారు.

    ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ తాజా వార్తలు
    DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు  రక్షణ
    India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్ చైనా
    PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025