Modi in Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో మోదీ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తన మొదటి కాశ్మీర్ పర్యటనలో,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹6,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం శ్రీనగర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ర్యాలీకి వేదికైన బక్షి స్టేడియంలో సందర్శన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో,భారతీయ జనతా పార్టీ(బిజెపి)నాయకత్వం,ఈ పర్యటన ముస్లింలు మెజారిటీ కాశ్మీర్‌లో పార్టీ అవకాశాలను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఇక్కడ పార్టీ మొదటిసారిగా దక్షిణ కశ్మీర్‌లోని లోక్‌సభ సీటుపై కన్నేసింది. "నరేంద్ర మోదీ ఉనికి మా కార్యకర్తలకు పెద్ద ఊపునిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు,కశ్మీర్ ప్రజలకు ఆయన కొన్ని శుభవార్తలను తెలియజేసే అవకాశం ఉంది'' అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు.
వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ₹ 5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి
ఈ ర్యాలీకి రెండు లక్షల మంది హాజరవుతారని పార్టీ స్థానిక అధ్యక్షుడు రవీంద్ర రైనా తెలిపారు."ఈ ఈవెంట్‌ను చారిత్రాత్మకంగా చేయడానికి మేము మా వందల మంది కార్యకర్తలను మోహరించాము," అని అయన చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు,నేషనల్ కాన్ఫరెన్స్(NC),పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP)ప్రధానమంత్రి పర్యటనలో ముఖ్యమైనది ఏమీ కనిపించడం లేదని నిలదీశాయి. బక్షి స్టేడియానికి వచ్చిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ"విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్" కార్యక్రమంలో పాల్గొంటారు. జమ్ముకశ్మీర్ లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ₹ 5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బహుళ ప్రాజెక్టులు,₹1,400 కోట్ల స్వదేశ్ దర్శన్, ప్రసాద్(తీర్థయాత్ర పునరుజ్జీవనం,ఆధ్యాత్మిక,హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్)పథకం,హజ్రత్‌బాల్ పుణ్యక్షేత్రం సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తారు.