
Ganesh Chaturthi: దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
విఘ్నాలను తొలగించే, విజ్ఞానాన్ని ప్రసాదించే గణనాథుడి జన్మదిన వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికపై సందేశాన్ని పంచుకున్నారు. "అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భక్తిశ్రద్ధతో నిండి ఉన్న ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శుభాలను తీసుకురావాలి. తన భక్తులందరికీ సంతోషం, శాంతి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గజాననుడిని ప్రార్థిస్తున్నాను. గణపతి బప్పా మోరియా!" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
आप सभी को गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति से भरा यह पावन अवसर हर किसी के लिए शुभकारी हो। भगवान गजानन से प्रार्थना है कि वे अपने सभी भक्तों को सुख, शांति और उत्तम स्वास्थ्य का आशीर्वाद दें। गणपति बाप्पा मोरया!
— Narendra Modi (@narendramodi) August 27, 2025
వివరాలు
ఎక్స్ వేదికగా విషెస్ తెలిపిన ప్రముఖులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి వ్యక్తి జీవితంలో గణపతి ఆశీస్సులతో సుఖసమృద్ధి కలగాలని ఆయన ప్రార్థించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, విఘ్నహర్త గణేశుని దయతో దేశంలో ఐక్యత, శాంతి, అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం రాష్ట్ర ప్రజలు, భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజలు తమ ఇళ్లలో, బహిరంగ మండపాల్లో గణనాథుడి అందంగా అలంకరించిన విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు సాగే పండుగ అనంతరం నిమజ్జన పద్ధతిలో ఈ వేడుకలు ముగుస్తాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమిత్ షా చేసిన ట్వీట్
श्री गणेश चतुर्थी के पावन पर्व की सभी को हार्दिक शुभकामनाएँ। गणपति बाप्पा से सभी के जीवन में सुख-समृद्धि की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) August 27, 2025
गणपति बाप्पा मोरया! pic.twitter.com/RNakkxNXNb