
Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ
ఈ వార్తాకథనం ఏంటి
సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.
ఈ క్రమంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
దీంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.
ప్రధాని మోదీ ఈ నెల జనవరి 13న బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంపారన్‌లోని బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
అయితే ఈ వేదక నుంచే ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
బిహార్ పర్యటనలో రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
మోదీ
జనవరి, ఫిబ్రవరిలో విస్తృత సభలు
బిహార్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది.
అందులో భాగంగానే ప్రధాని మోదీని రంగంలోకి దించుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి, ఫిబ్రవరిలో బిహార్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా వివిధ ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
జనవరి 13న మోదీ ఆధ్వర్యంలో తొలి సభను ఏర్పాటు చేసి.. 15వ తేదీని సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.
13వ తేదీన బిహార్‌లోని బెగుసరాయ్, బెట్టియా, ఔరంగాబాద్‌లో నిర్వహించే మూడు ర్యాలీలలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
అమిత్ షా జనవరి, ఫిబ్రవరిలో సీతామర్హి, మాధేపురా, నలందలో సభల్లో పాల్గొననున్నారు.