LOADING...
PM Modi: బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోదీ
బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi: బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అధికారికంగా ప్రారంభించారు. అదే వేదిక నుంచి వర్చువల్ విధానంలో అమృత్‌సర్-కాట్రా, నాగ్‌పూర్-పుణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం బెంగళూరు-బెళగావి వందే భారత్ రైలులో స్వయంగా ప్రయాణించి, విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. తరువాత, నగర మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఆర్‌వీ రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.15 కిలోమీటర్ల ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. చివరగా, ప్రధాన మంత్రి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెట్రో ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించిన మోదీ