
PM Modi: ముగిసిన మోదీ జపాన్ పర్యటన..ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుకోసం చైనాకు పయనం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో తన రెండు రోజుల అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటన అనంతరం ఆయన చైనా కు బయలుదేరారు. రేపు తియాజింగ్ వేదికపై జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. మోదీ జపాన్ పర్యటనలో భారత ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందించగలిగిన అద్భుత ఫలితాలను సాధించానని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. ఈ పర్యటనను తాను ఎప్పటికీ మరచిపోలేను. జపాన్ ప్రధాని ఇషిబాతో సహా అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయతకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మోదీ వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
వివరాలు
ఫైనల్ అయ్యిన 13 ఒప్పందాలు
ఈ పర్యటన సందర్భంగా భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. మొత్తం సుమారు 13 ఒప్పందాలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. భవిష్యత్తులో భారత్‌లో రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు జపాన్ పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇరుదేశాలు సెమీకండక్టర్లు, శుద్ధి-శక్తి, టెలికాం, ఫార్మాస్యూటికల్స్, ముఖ్యమైన ఖనిజాలు,అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకునేందుకు అంగీకరించాయి. చంద్రయాన్-5 ప్రాజెక్టులో భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందంపై కూడా సంతకాలు కూడా జరిగాయి.
వివరాలు
చైనాలో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనున్న మోదీ
శనివారం మోదీ జపాన్ గవర్నర్లతో సమావేశమై వారితో సానుకూల సంభాషణ జరిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మోదీ జపాన్ ప్రధానితో కలిసి సెండాయ్‌లో బుల్లెట్ రైలులో ప్రయాణం చేసి మియాగిలోని సెమీకండక్టర్ ఫ్యాక్టరీను సందర్శించారు. అదే సమయంలో, మోదీ జపాన్ పర్యటనను ముగించి చైనాకు బయలుదేరారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో చైనాలో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ఆయన సమావేశం కానున్నారు. వారితో భేటీకి ఆయన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక ప్రకటనలో మోదీ తెలిపారు.