BRICS Summit 2024: నేడు నుంచి రష్యాలోనిబ్రిక్స్ సమ్మిట్ 2024.. ప్రధాని మోదీ - అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ..
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సు రష్యాలోని కజాన్ వేదికగా ప్రారంభం కానుంది.
ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.
ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా ఇతర దేశాధినేతలు పాల్గొననున్నారు.
వివరాలు
బ్రెజిల్ అధ్యక్షుడు సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
అయితే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన ఆరోగ్య సమస్య కారణంగా ఈ సదస్సుకు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయారు.
బాత్రూమ్‌లో పడి తలకు గాయమైన కారణంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని అధికారికంగా ప్రకటించారు.
బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
ఈ ఏడాది ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు కూడా సభ్యత్వం పొందిన తర్వాత ఇదే మొదటి శిఖరాగ్ర సదస్సు.
వివరాలు
ప్రధాని మోదీ రష్యా పర్యటనకు రెండోసారి
ఇక, భారత ప్రధాన మంత్రి మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి భారత-రష్యా వార్షిక సమావేశానికి కూడా అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలు, అలాగే ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రపంచవ్యాప్త విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి.
పుతిన్‌తో గత సమావేశంలో మోదీ, యుద్ధం సమస్యలను పరిష్కరించలేదని స్పష్టం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇదే ఏడాదిలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు రెండోసారి వచ్చారు. బ్రిక్స్ సదస్సులో పలు ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి.