
Pm modi: ఈ నెలాఖరులో ప్రధాని మోదీ యూకే పర్యటన!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అధికారికంగా సంతకాలు చేసే దశలో భాగంగా, అలాగే రక్షణ, భద్రత వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మోదీ ఈ పర్యటన చేపట్టనున్నట్టు సమాచారం. ప్రధాని పర్యటన తేదీలను ఖరారు చేసే ప్రక్రియ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చల దశలో ఉన్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. జులై నెల చివరిలో లేదా ఆగస్టు ప్రారంభంలో ఈ పర్యటన జరగవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
భారత్,యూకే దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ఇదిలా ఉంటే,యూకే కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ తొలుత భారత్ పర్యటనకు వస్తారనే సంకేతాలు వెలువడినప్పటికీ,ఆయన పర్యటన ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత మే నెలలో భారత్,యూకే దేశాల మధ్య మూడు సంవత్సరాలపాటు జరిగిన చర్చల అనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి చెందిన వస్తువులు,సేవలకు యూకేలో మార్కెట్ వృద్ధి చెందనుండగా,బ్రిటన్‌కు చెందిన ఉత్పత్తులు,సేవలు భారత మార్కెట్లో మరింత అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా,రెండు దేశాల్లోనూ ఉద్యోగావకాశాలు,అభివృద్ధి స్థాయి,ఎగుమతుల పరిమాణం పెరగనున్నాయి. ఈ ఎఫ్‌టీఏతో పాటు,యూకేకు భారత్ ఎగుమతి చేసే వస్తువుల్లో సుమారు 99 శాతానికి పైగా టారిఫ్‌లు (సుంకాలు) పూర్తిగా తొలగించబడనున్నాయి.
వివరాలు
పెరిగిన బ్రిటన్ దిగుమతులు
అదే విధంగా, యూకే నుంచి భారత్‌కు వచ్చే 90 శాతం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. 2020లో బ్రెగ్జిట్ ప్రక్రియలో భాగంగా యూకే ఐరోపా యూనియన్ (ఈయూ) నుంచి విడిపోయిన తర్వాత, ఇతర దేశాలతో స్వతంత్ర వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడ రుగా వాణిజ్యఒప్పందం కుదుర్చుకుంది. బ్రెగ్జిట్ తరువాత ప్రారంభ దశలో భారతదేశం నుంచి బ్రిటన్‌కు ఎగుమతులు కొంత మేర తగ్గినా, తరువాత మళ్లీ స్థిరత సాధించాయి. అదే సమయంలో బ్రిటన్ దిగుమతులు కూడా పెరిగాయి. తాజా ఎఫ్‌టీఏ ద్వారా ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు మరింత విస్తరించనున్నాయి.