PM Modi: ట్రంప్‌తో సమావేశం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు దొరికిన అవకాశం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవిని చేపట్టిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారిగా అమెరికా (USA) పర్యటన చేయనున్నారు.
ఈ సందర్భంగా త్వరలోనే ఆయన ట్రంప్‌ను కలవనున్నారు. ఈ పర్యటన వల్ల కలిగే లాభాలు, అలాగే ట్రంప్ అధ్యక్ష పదవిలో తన తొలి కాలంలో భారత్‌కు అందించిన సహాయ సహకారాలను మోదీ గుర్తుచేసుకున్నారు.
వివరాలు
సాంకేతికత, రక్షణ, వాణిజ్య సహా పలు రంగాల్లో భారత్-అమెరికా సంబంధాలు
''అమెరికా పర్యటనలో భాగంగా నా సన్నిహితుడు ట్రంప్‌ను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత ఆయన ప్రభుత్వం భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి సహాయపడింది. ఇప్పుడు ఈ బంధాన్ని మరింత బలపరిచే అవకాశాన్ని కలిగించుకుంది. సాంకేతికత, రక్షణ, వాణిజ్య సహా పలు రంగాల్లో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడుతాయని నేను ఆశిస్తున్నాను. మా ఈ చర్చలు రెండు దేశాలకే కాకుండా, ప్రపంచ అభివృద్ధికి కూడా తోడ్పడతాయని నమ్ముతున్నాను'' అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాలు
ట్రంప్ గెలుపు తర్వాత ప్రధాని తొలిసారి అమెరికా పర్యటన
ఇటీవల ఫ్రాన్స్‌లో నిర్వహించనున్నఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, ఆ సమావేశానికి సహ-అధ్యక్షత వహించారు.
ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటన చేపడుతున్నారు.