Page Loader
PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను పెంచామని, రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని మోదీ వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' ద్వారా సామాన్యులు మెరుగైన ఆరోగ్య సేవలు పొందుతున్నారని, దాదాపు నాలుగు కోట్ల మందికి ఇది ప్రయోజనం చేకూర్చిందని వివరించారు.

వివరాలు 

దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన

బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ, దేశ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేకాక, బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు ఫలితం లేకుండా పోయాయని, కానీ నీతీశ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని పేర్కొన్నారు.