Page Loader
PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం

PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంగా ఖ్యాతి పొందిన మహాకుంభమేళా (Kumbh Mela)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ వేడుక జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు కొద్దిసేపటి క్రితం చేరుకున్న ఆయన, త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఉన్నారు. మొదట ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి అరైల్‌ ఘాట్‌కు వెళ్లారు. అనంతరం, ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆపై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఆయనతో కలిసి బోటులో ప్రయాణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బోటు లో ప్రయాణిస్తున్న ప్రధాని