Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
మికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం గ్రేటర్ నోయిడాకు విచ్చేస్తున్నారు. ప్రధాని ఉదయం 10:20 గంటలకు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ సంబంధిత సూచనలు జారీ చేశారు. బుధవారం,చిల్లా రెడ్ లైట్ నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వెళ్లే వాహనాలను సెక్టార్-14A ఫ్లై ఓవర్ నుండి గోల్చక్కర్ చౌక్,సెక్టార్-15 వైపు మళ్లిస్తారు. అదేవిధంగా,DND నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వెళ్లే ట్రాఫిక్‌ను రజనిగంధ చౌక్, సెక్టార్-16 వైపు మళ్లిస్తారు.
ట్రాఫిక్ సంబంధిత సూచనలు
ఈ ట్రాఫిక్ MP-01 మార్గం లేదా DSC మార్గం ద్వారా తమ గమ్యానికి చేరుకోవచ్చు. కాళంది సరిహద్దు నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వెళ్లే ట్రాఫిక్‌ను మహామాయ ఫ్లైఓవర్ నుండి సెక్టార్-37 వైపు మళ్లిస్తామని ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. ఈ ట్రాఫిక్ MP-03 మార్గం లేదా DSC మార్గం ద్వారా వెళ్లవచ్చు. సెక్టార్-37 నుండి ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా గ్రేటర్ నోయిడా వెళ్ళే వాహనాలను సెక్టార్-44 రౌండ్‌అబౌట్ నుండి డబుల్ సర్వీస్ రోడ్ వైపు మళ్లిస్తారు, అక్కడ నుండి DSC మార్గం ద్వారా గమ్యానికి చేరుకోవచ్చు.