LOADING...
Vikram Misri: ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు
ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు

Vikram Misri: ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్ళబోతున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రం మిశ్రి ఈరోజు వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన ఆయన జపాన్ చేరుకుంటారని ఆ శాఖ స్పష్టంచేసింది. ఈ సందర్బంగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎనిమిది సార్లు జపాన్ పర్యటించిన విషయాన్ని మిశ్రి గుర్తుచేశారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ నేరుగా చైనాకు వెళ్లనున్నారు.

వివరాలు 

క్వాడ్ గ్రూప్‌లో భారత్,జపాన్ 

ఈ సందర్భంగా విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ, భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. ఆ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. వీటికి సంబంధించిన వివరాలను తరువాత అప్‌డేట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్, జపాన్ రెండూ క్వాడ్ గ్రూప్‌లో కీలక స్థానంలో ఉన్నాయని గుర్తుచేశారు. జపాన్ పర్యటన పూర్తయిన తర్వాత, చైనాలోని ప్రముఖ పోర్టు నగరం తియాంజిన్‌కు ప్రధాని మోదీ బయలుదేరతారు. అక్కడ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాలకు ఆయన హాజరవుతారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ