LOADING...
PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

వ్రాసిన వారు Stalin
ద్వారా సవరించబడింది Sirish Praharaju
May 07, 2024
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజక వర్గాల్లో ఈ రోజు లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని మోడీని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది చదువుకున్న యువత తమ ఓటుహక్కును వినియోగించుకోవట్లేదు అంట. ఈ నేపథ్యంలో ప్రధాని గతంలో కూడా యువతకు ఓటుపై అవగాహన ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కూడా అదే స్పూర్తితో ఓటు వేయమని పిలుపునిచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న మోదీ 

Details 

ఎన్నికల పోరులో  ప్రముఖ నేతలు

లోక్ సభ ఎన్నికల్లో 17.24 కోట్ల మంది ఓటర్లు తమఓటు హక్కు వినియోగించు కోవడానికి అర్హులు. నేటి ఎన్నికల పోరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు చాలామంది ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. 1300 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.