
Sanjay Raut: తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ కి మోడీ మోడీ తెలిపారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు తెలియజేశారని పేర్కొన్నారు.
అదేవిధంగా, ప్రధాని మోడీ వారసుడి ఎంపికను ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని ఆరోపించారు.
"నాకు తెలిసినంత వరకు గత 10-11 సంవత్సరాల్లో మోడీ జీ ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించలేదు," అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
జాతీయ స్థాయిలో నాయకత్వ మార్పు కోసం ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ఆర్ఎస్ఎస్ తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది: సంజయ్
అదే విధంగా, భవిష్యత్ నాయకుడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్ణయిస్తుందని కూడా ఆయన తెలిపారు.
"ఆర్ఎస్ఎస్ గురించి నేను అర్థం చేసుకున్న రెండు ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటున్నాను. మొదటిది, ఆ సంస్థ దేశ రాజకీయ నాయకత్వంలో మార్పును కోరుకుంటోంది. రెండవది, మోడీ జీ కాలం ముగిసిందని భావిస్తోంది. ఇక ఆయన కూడా మార్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది," అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
అయితే, ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉందని, మోడీ పర్యటన సంఘ్ పరివార్‌లో జరుగుతున్న విస్తృత రాజకీయ వ్యూహంలో భాగమని సంజయ్ రౌత్ ఆరోపించారు.