Page Loader
IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

IIM Vizag Campus: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరం విశాఖపట్టణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇది భారతదేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలలో ఒకటైన IIM విశాఖపట్నం ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. శాశ్వత క్యాంపస్‌కు 2015 జనవరి 17న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు హాజరు కానున్నారు.

Details 

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ.. విశాఖ ఐఐఎం 

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు. భవనాల నిర్మాణానికి అవసరమైన 472.61 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. శాశ్వత క్యాంపస్ దాదాపు 62,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. అలాగే, 1500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానల్స్‌ సైతం ఏర్పాటు చేశారు. అదనంగా, ఇందులో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, క్రికెట్‌ మైదానం,ఇండోర్‌,అవుట్‌డోర్‌ గేమ్స్‌కు అనుగుణమైన సదుపాయాలు, జిమ్‌, యోగా, మెడిటేషన్‌ సెంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖకు ఐఐఎంను కేటాయించింది.