Page Loader
PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 
PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ

PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Nov 12, 2023
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వించదగ్గ అనుభవం అని ప్రధాని అన్నారు. తాను ప్రతి ఏటా ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకుంటానన్నారు. రాముడు ఉన్నది అయోధ్య అని చెబుతారని, కానీ తనకు మాత్రం భారత జవాన్లు ఉన్నచోటే అయోధ్య అని పేర్కొన్నారు. సైనికులు తమ అంకితభావంతో దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మోదీ అన్నారు. దేశం సైనికులకు రుణపడి ఉంటుందన్నారు. సైనికులను మోహరించిన ప్రదేశం దేవాలయానికి తక్కువేం కాదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

దీపావళి

రక్షణ రంగంలో గ్లోబల్ ప్లేయర్‌గా భారత్: మోదీ

సైనికులతో వేడుకల జరుపుకుంటున్న నేపథ్యంలో లెప్చాను దేశం మొదటి గ్రామంగా మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. పండగ రోజు కుటుంబాలకు దూరంగా సరిహద్దుల వద్ద ఉన్న సైనికుల దేశభక్తి పరాకాష్ట నిదర్శనం అన్నారు. రక్షణ రంగంలో భారతదేశం గ్లోబల్ ప్లేయర్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఇప్పుడు దేశానికి మాత్రమే కాకుండా స్నేహపూర్వక దేశాలకు కూడా రక్షణ సంబంధిత అవసరాలను తీర్చడానికి భారత్ ప్రయత్నిస్తోందన్నారు. 2016లో భారతదేశ రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని, ఇప్పుడు దేశీయ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని మోదీ వెల్లడించారు. మోదీ 2014లో తొలిసారిగా దేశ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతి ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న మోదీ