Page Loader
PM Modi-Bill Gates: AI పై చర్చించిన నరేంద్ర మోదీ ,బిల్ గేట్స్

PM Modi-Bill Gates: AI పై చర్చించిన నరేంద్ర మోదీ ,బిల్ గేట్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌,భారత ప్రధాని నరేంద్ర మోదీ AI టెక్నాలజీ పై చర్చించారు. ఈ సందర్బంగా భారతీయులపై బిల్ గేట్స్ ప్రసంశలు కురిపించాడు.టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా అందిపుచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకుపోతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. డిజిటల్ ప్రెమెంట్స్,డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రా,మహిళల సారథ్యంలో సాగే అభివృద్ధి,సృజనాత్మకత వంటి ఆసక్తికర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో ముడిపడి ఉన్న ప్రమాదాల గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. సరైన శిక్షణ ఇవ్వకపోతే ప్రజలు సాంకేతికతను దుర్వినియోగం చేస్తారని అన్నారు. ప్రజలు AIని మాయా సాధనంగా ఉపయోగిస్తే, అది"తీవ్ర అన్యాయానికి"దారి తీస్తుందని కూడా ఆయన అన్నారు.

Details 

న‌మో యాప్‌లో ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా సెల్ఫీ

ఒక ఫ్రీవీలింగ్ సంభాషణలో, డీప్‌ఫేక్‌ల సమస్యను ఎదుర్కోవడానికి AI- రూపొందించిన కంటెంట్‌కు వాటర్‌మార్క్ ఉండాలని తాను సూచించినట్లు పీఎం మోదీ చెప్పారు. మానవ ఉత్పాదకతను మెరుగుపరచడానికి చాట్‌జిపిటి వంటి AI సాధనాలను ఉపయోగించాలని పిఎం మోడీ పిలుపునిచ్చారు. అయితే సోమరితనంతో సాంకేతికతను ఉపయోగిస్తున్న వారు తప్పు మార్గాన్ని ఎంచుకుంటున్నారని హెచ్చరించారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ దిగారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిజిటిల్ విప్లవం గురించి బిల్ గేట్స్, మోదీ  చర్చ