ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, ఎయిమ్స్లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలతోనే భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తున్నాయని మోదీ తెలిపారు.
తాజాగా QS గ్లోబల్ ర్యాకింగ్స్లోనూ భారత వర్సిటీలు సత్తా చాటుకున్నాయని మోదీ గుర్తు చేశారు. ఒక దశలో దిల్లీ యూనివర్సిటీ పరిధిలో కేవలం 3 కాలేజీలు మాత్రమే ఉండేవన్న మోదీ, ఇప్పడు ఆ సంఖ్య 90కు చేరుకున్నాయన్నారు.
2014లో కేవలం 12 భారత విద్యాసంస్థలు మాత్రమే అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 45కు చేరుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, ఎయిమ్స్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిందని మోదీ వెల్లడించారు.
DETAILS
ఆ 4 జాతీయ సంస్థలే నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ
ఐఐటీ, ఐఐఎమ్, ఎన్ఐటీ, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలే నవ భారతాన్ని నిర్మిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు మన దేశం బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.
ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ మేరకు టాప్ 5 దేశాల సరసన స్థానం సంపాదించామన్నారు.
తొలుత విశ్వవిద్యాలయం ఆవరణలో మూడు కొత్త భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం దేశ, విదేశాల నుంచి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తదితరులు పాల్గొన్నారు.