LOADING...
ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్
30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్

ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని పాకిస్థాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ షేక్ మోదీకి రాఖీ కట్టనున్నారు. ఇందుకోసం ఈనెల 30న పాక్ నుంచి దిల్లీకి రానున్నారు. గత 30సంవత్సరాలుగా మోదీకి కమర్ రాఖీ కడుతున్నారు. ఈ మేరకు కమర్ మొహిసిన్ మోదీకి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ దీర్ఘాయువుతో, ఆరోగ్యంగా ఉండాలని తాను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నానన్నారు. తన కోరికలన్నీ నెరవేరుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించానని, ఆ కోరిక నేరవేరిందన్నారు. మరోవైపు తానెప్పుడు రాఖీ కట్టినా, ఆయన ప్రధాన మంత్రి కావాలనే కోరికను చెప్పేదాన్నన్నారు. దేవుడు తన కోరికలను నెరవేర్చాడని మొహిసిన్ చెప్పుకొచ్చారు.

DETAILS

భారత్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ: కమర్ 

మోదీ భారత్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, మంచి పనితీరు కనబరుస్తున్నారని కమర్ మొహిసిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా చేతితో తయారు చేసిన రాఖీలనే కమర్ మోదీకి కడుతుండటం విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ కొనసాగిన సమయంలోనూ కమర్ ఆయనకు రాఖీ కట్టారు. కానీ కొవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ కాలంలో సోదరుడికి రాఖీ కట్టలేకపోయానని మొహిసిన్ అన్నారు. అయినప్పటికీ రాఖీని పోస్ట్ ద్వారా పంపించానని చెప్పుకొచ్చారు. మరోవైపు తన వివాహం అనంతరం గత 30 ఏళ్లుగా మోదీకి రాఖీలు కడుతూనే ఉన్నానని కమర్ తెలిపారు.