Page Loader
PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది. ముఖ్యంగా అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సాధారణ జీవనవిధానం పూర్తిగా స్థంభించింది. తీవ్ర వర్షాలు అక్కడ వరదలకు దారితీశాయి. ఇప్పటివరకు ఈ విపత్తు కారణంగా దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక చొరవ తీసుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ప్రధాని ఫోన్ ద్వారా మాట్లాడారు. వరదల ప్రభావాన్ని అధిగమించేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

వివరాలు 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టింది: హిమంత 

ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాం సహా సరిహద్దు రాష్ట్రాల్లోనూ వరదలు వస్తున్న దృశ్యాన్ని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టినదీ వివరించారు. ఈ సహాయ కార్యక్రమాల వివరాలను ప్రధానికి తెలియజేశామన్నారు. అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలూ చోటుచేసుకున్నాయని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్