Parliament Session: నేడు లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం
రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చకు మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. లోక్‌సభలో సోమవారం ఉదయం ప్రారంభమైన చర్చ రాత్రి( 16 గంటలు) వరకు కొనసాగింది. మంగళవారం సాయంత్రంతో చర్చలు ముగిసే అవకాశం ఉందని, ఆ తర్వాత మోదీ స్పందిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై విపక్షాల ఆందోళన కారణంగా ధన్యవాద తీర్మానంపై చర్చ శుక్రవారం ప్రారంభం కాలేదు.
రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ సమాధానం
తన సమాధాన ప్రసంగంలో,ప్రధాని మోదీ సోమవారం సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తారు. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారు.అధికార పక్షం,విపక్షాల మధ్య వాగ్వాదం తర్వాత ఎట్టకేలకు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరపున తొలి స్పీకర్‌గా మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ప్రసంగం సందర్భంగా,ప్రభుత్వ విజయాలను వివరిస్తూ,అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. భాజపా తరపున తొలిసారిగా లోక్‌సభకు చేరుకున్న బన్సూరి స్వరాజ్,అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇస్తూ తన తల్లి దివంగత సుష్మా స్వరాజ్‌ను కూడా గుర్తు చేసుకున్నారు.