Page Loader
Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి

Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ ఠాకూర్‌కి మద్దతుగా రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రసంగించారు. పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలని, వారిని విదేశీయుల్లా చూడకుండా సొంతవారిలా ఆదరిస్తామన్నారు. ఆర్టికల్ 370 గురించి నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి హామీ ఇచ్చిన విషయం ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

 ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం అసాధ్యం 

ఎన్సీ మేనిఫెస్టోలో ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ గురించి మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, ఎన్సీ,కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఉన్నంతవరకు జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడం అసాధ్యమని చెప్పారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, 2014 ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, పీడీపీలు ఒంటరిగా పోటీలో నిలబడగా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)-కాంగ్రెస్‌లు కలిసి కూటమిగా పోటీలో ఉన్నాయి. ఆర్టికల్ 370, 35-ఏ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మార్పులని రాజ్‌నాథ్ స్వాగతించారు. గతంలో ఇక్కడ యువకులు పిస్టల్స్, రివాల్వర్లను కలిగి ఉండగా, ఇప్పుడు వారి చేతుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నాయని చెప్పారు.

వివరాలు 

90 సభ్యుల అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 90 సభ్యుల అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి: మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.