Page Loader
Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు
వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు

Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్ (ఏఐఎస్)లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది. ఆమె వ్యాఖ్యలు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని వికలాంగుల హక్కుల సంఘం విక్లాంగ్ హక్కుల రక్ష పోరాట సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐఏఎస్ అధికారుల వ్యాఖ్యలు అసహ్యకరమైనవి, బాధాకరమైనవిగా పేర్కొన్నారు. హక్కుల సంఘం అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కి సంబంధించిన ఇటీవలి వివాదంపై స్మితా సబర్వాల్ మరోసారి 'ఎక్స్‌' వేదికగానే స్పందించారు.

వివరాలు 

స్మితా సబర్వాల్ స్పందన 

ఐపీఎస్‌/ ఐఎఫ్‌ఒఎస్‌తో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్నవారు చెప్పాలన్నారు. ఐపీఎస్‌, ఐఎఫ్‌ఒఎస్‌ లాగే ఐఏఎస్‌లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. అంతేకానీ సున్నిత స్వభావానికి నా మనసులో చోటు లేదనడం కరెక్ట్‌ కాదు' అని తెలిపారు.