Smita Sabharwal: ఐఏఎస్‌లలో వికలాంగుల కోటా ఎందుకు.. 'ఎక్స్'లో స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దూమారం
వికలాంగుల కోటా కింద ఎంపికైన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై కొనసాగుతున్న వివాదం నడుమ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో వికలాంగుల కోటా ఆవశ్యకతపై ప్రశ్నలు సంధించి కొత్త వివాదం సృష్టించారు. ఒక ఎక్స్-పోస్ట్‌లో, తెలంగాణ ఫైనాన్స్ కమీషన్ మెంబర్-సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏమన్నారంటే.. ''ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో..దివ్యాంగులను గౌరవిస్తూనే..విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా?వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి.ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది.ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం.ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా'' అని పేర్కొన్నారు.
స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్
ప్రియాంక చతుర్వేదికి సభర్వాల్ సమాధానం
పోస్ట్ వైరల్ అయిన వెంటనే,పలువురు నెటిజన్లు ఖండించారు.సబర్వాల్ ట్వీట్‌పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ''ఈ పోస్ట్ చూస్తోంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోంది'' అని ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇక, స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు చాల అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య డిమాండ్ చేశారు. స్మితాసభర్వాల్ పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కోరారు.