Supreme Court: భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు ఆర్థం చేసుకోవాలి : సుప్రీం కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ దశలో, కనీసం ఇప్పటికైనా పోలీసులు వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని కోర్టు సూచించింది.
రెచ్చగొట్టే పాటను షేర్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ధర్మాసనం ఈ కేసు తీర్పును రిజర్వులో ఉంచింది
Details
వివాదాస్పద పోస్టు.. కేసు నమోదు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇటీవల జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ పాల్గొన్నారు.
తర్వాత ఓ పద్యంతో కూడిన వీడియోను షేర్ చేయడంతో వివాదాస్పదమైంది.
ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంటూ జనవరి 3న గుజరాత్ పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Details
సుప్రీంకోర్టులో విచారణ
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కుగా ప్రాముఖ్యతను కోర్టు మరోసారి వివరించింది.
పోలీసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేవలం పద్యం మాత్రమేనని, అనువాదంలో కొంత అపార్థం ఏర్పడి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని సూచించింది.
75 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలోనైనా భావప్రకటనా స్వేచ్ఛపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వులో ఉంచింది.