Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.
రైతులు ర్యాలీగా బయలుదేరగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు పరుగులు తీశారు.
రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని హర్యానాలోని కురుక్షేత్రలో పోలీసులు కాంక్రీట్ స్లాబ్‌లు, ఇనుప మేకులు, బారికేడ్లు, ముళ్ల తీగలు, పోలీసులు, 11కంపెనీల పారామిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ఎస్పీ ఝజ్జర్ అర్పిత్ జైన్ తెలిపారు.
శాంతిభద్రతలను అదుపు చేసేందుకు దిల్లీ పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్‌ను విధించారు.
దిల్లీ సరిహద్దులో శంభు వద్ద మాత్రమే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు, మిగతా చోట్ల పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు
#WATCH | Police fire tear gas to disperse protesting farmers at Punjab-Haryana Shambhu border. pic.twitter.com/LNpKPqdTR4
— ANI (@ANI) February 13, 2024