Prashant Kishor: బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయం: ప్రశాంత్ కిషోర్
బీజేపీకి లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో 300 సీట్లు రావచ్చని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇండియాటుడే టివికిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో 370 సీట్లు దక్కకపోవచ్చన్నారు. 300 సీట్లు ఖాయంగా వస్తాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కేడర్ లో జోష్ నింపడానికి 400 సీట్లు దాటాలని నిర్ధేశించారన్నారు. కానీ 370 సీట్లు రావడం కష్టమైనా 270 మాత్రం పక్కాగా వస్తాయని తెలిపారు. 300 కాకపోయినా 303 వరకు రావచ్చన్నారు. 2019 మాదిరిగా303 ఈ సారి రాకపోయినా 270 కనీస మెజార్టీకి తగ్గబోవన్నారు.
మోదీకి ప్రజల్లో వ్యతిరేకత లేదు
మోదీకి ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. పదేళ్లు ప్రధానిగా పని చేసిన వ్యక్తిపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొనడం సహజమన్నారు. ప్రధాని పీఠం నుంచి మోదీని తొలగించాలనే స్ధాయిలో ప్రజల్లో ఎక్కడా నిరసన స్వరం చూడలేదని వివరించారు. 2019 మాదిరిగా 303 రావటానికి కారణమైన 250 సీట్లు కేవలం ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో వచ్చాయని తెలిపారు. అయితే ఈ సారి ఈ రాష్ట్రాల్లో 50 సీట్లు తగ్గవచ్చన్నారు. వీటిని దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో గెలవటం ద్వారా భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.