"సాధ్యమైనంత వరకు ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాం": ఇండియా బ్లాక్ రిజల్యూషన్
ముంబైలో మూడవ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలన్న కూటమి తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు"వెంటనే"ప్రారంభమవుతాయని తెలిపింది. ఇండియా లోగో విడుదలపై భిన్నాభిప్రాయాలు అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం వాయిదా పడింది.
భారత కూటమి 13 మంది సభ్యుల సమన్వయ ప్యానెల్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్,ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్,తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్,శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్,ఆర్‌జెడి నాయకుడు,బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ,ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా,సమాజ్‌వాదీ పార్టీ నుంచి జావేద్ ఖాన్,జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.
రాష్ట్రాల్లో పొత్తుల చర్చలపై వచ్చే భేటీలో ప్రకటించే అవకాశం
కోఆర్డినేషన్ ప్యానెల్ లీడర్‌ను ఇంకా ప్రకటించలేదు. సమావేశం సందర్భంగా విడుదల చేసిన తీర్మానంలో, సభ్య పార్టీలు "సాధ్యమైనంత వరకు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని" భారత కూటమి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించడమే కాకుండా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వీలైనంత త్వరగా ఈ చర్చలు ముగుస్తాయని కూడా తెలిపింది. తద్వారా రాష్ట్రాల్లో పొత్తుల చర్చలు పూర్తి చేసుకుని వచ్చే భేటీలో ప్రకటించే అవకాశాలున్నాయి. అంతకుముందు రోజు సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం "ప్రతీకార రాజకీయాలు" చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ నిరంకుశ పాలనతో నష్టపోయాం: ఖర్గే
ఇండియా కూటమి ప్రాబల్యం పొందుతున్నందున ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై ఏజెన్సీలను ఎక్కువగా దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు, అట్టడుగువర్గాలు, మధ్యతరగతి, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులతో సహా సమాజంలోని ప్రతి వర్గమూ బీజేపీ నిరంకుశ పాలనతో నష్టపోయామని ఖర్గే అన్నారు. "అమాయక రైలు ప్రయాణికులు, పాఠశాల పిల్లలపై ద్వేషపూరిత నేరాలకు" కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. సమావేశానికి ముందు తీసిన విపక్ష నేతల గ్రూప్ ఫోటోను X లోషేర్ చేస్తూ, ఖర్గే భారత పౌరులు "ఇకపై మోసపోకూడదని అలాగే "140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారని రాసుకొచ్చారు.