Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను'
భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ హస్తం పార్టీ తనపై చిత్రహింసలు చేయించినట్లు ఆరోపించారు. ఏటీఎస్ కస్టడీలో ఉండగా అనుభవించిన ఆ హింసలు జీవితాంతం తనను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ వాడకం వల్ల తన శరీరం మొత్తం వాపు సమస్యలు ఎదుర్కొంటోందని తెలిపారు.
హిందూయేతర దుకాణదారులు వారి షాపులపై పేర్లు రాయాలని డిమాండ్
తాను బతికే ఉన్నంతవరకు కోర్టులో వాదించడానికి సిద్ధంగా ఉంటానని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె వైద్య చికిత్స కారణంగా కొంతకాలంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఈకేసులో ఎన్‌ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది, తదుపరి వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోర్టు ఆమె హాజరుకావాలని ఆదేశించింది. తాజాగా సాధ్వి ప్రజ్ఞా హిందూయేతర దుకాణదారులు వారి షాపులపై పేర్లు రాయాలని డిమాండ్ చేశారు. కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న తినుబండారాలపై పేర్లు స్పష్టంగా కనిపించేలా ఉంచాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై స్టే విధించింది.